VIDEO: కలెక్టరేట్ ముందు పత్తి రైతుల ధర్నా
NLG: అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను కాపాడాలని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు సోమవారం దెబ్బతిన్న పత్తి పంటను ప్రదర్శిస్తూ... పీఆర్పీఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ... తేమ శాతాన్ని 8 నుంచి 12కు పెంచి, మద్దతు ధరను పెంచాలని కోరారు.