VIDEO: బొలెరో ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు
అన్నమయ్య: రంజాన్ పండుగ సందర్భంగా మదనపల్లెకు వచ్చిన షరీఫ్ (30), అతని భార్య గులాబ్ (25), కూతురు షారా దంపతులు శనివారం స్వగ్రామం తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముదివేడు వద్ద బొలెరో వాహనం వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.