'ధురంధర్-2’ వివాదంపై మాధవన్ వివరణ
‘ధురంధర్-2’ చిత్రంలోని ఒక సన్నివేశంపై తలెత్తిన వివాదంపై నటుడు మాధవన్ స్పందించాడు. పవిత్రమైన ‘దశమ్ గ్రంథ్’లోని శ్లోకాలను పఠించే సమయంలో తాను సిగరెట్ కాల్చలేదని స్పష్టం చేశాడు. ఆ సీన్‌ను చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. తనకు అన్ని మతాల పట్ల అపారమైన గౌరవం ఉందని మాధవన్ తెలిపాడు.