సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా అరుణ ఏకగ్రీవం
BDK: సుజాతనగర్ మండలం టూ ఇంక్లైన్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుగులోత్ అరుణ ఏకగ్రీవం అయ్యారు. సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా బరిలో దిగిన ఆమె ఆ గ్రామపంచాయతీని వరుసగా రెండుసార్లు కైవసం చేసుకున్నారు. సహకరించిన పంచాయతీ ప్రజలకు అరుణ కృతజ్ఞతలు చెప్పారు. కాగా.. గత పంచాయతీ ఎన్నికల్లో ఆమె భర్త నగేష్ ఏకగ్రీవం కావడం గమనార్హం.