అమరేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక

NGKL: అమ్రాబాద్‌లోని అమరేశ్వర ఆలయానికి కొత్త కమిటీ గురువారం ఎన్నికైంది. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా తిప్పర్తి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా గోలి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా నోముల యుగేందర్ గౌడ్, కోశాధికారిగా వడుగుల శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని నూతన అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు.