ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రావణి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రావణి

ATP: శింగనమల నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, తాగునీటి ఎద్దడి నివారణపై పలు గ్రామాల ప్రజలు మొరపెట్టుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.