HYDలో డ్రగ్స్ కట్టడికి పకడ్బందీ చర్యలు: సజ్జనార్

HYDలో డ్రగ్స్ కట్టడికి పకడ్బందీ చర్యలు: సజ్జనార్

HYD: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. రౌడీషీటర్ల తరహాలో డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారులపై నిఘా ఉంటుందన్నారు. నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్స్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.