'చలిగాలుల పట్ల అప్రమత్తత అవసరం'

'చలిగాలుల పట్ల అప్రమత్తత అవసరం'

VKB: తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుల్కచర్ల వైద్యుడు కిరణ్ కుమార్ గౌడ్ చెప్పారు. శీతాకాలంలో అంటువ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వింత రోగాలతో ఆసుపత్రికి వస్తున్నారని, రోగాలకు గురైన ప్రజల రక్త నమూనాలను పరీక్షలు చేస్తామని తెలిపారు. అస్వస్థతకు గురైన వారు వెంటనే ఆసుపత్రికి రావాలని ఆయన కోరారు.