'సీజనల్ వ్యాధులపై అవగాహన'
KKD: వన్నెపూడి గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై శుక్రవారం అవగాహన కల్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఇంటి చుట్టుపక్కల నీరు నిలవ లేకుంకా ఇంట్లో పాత్రలు, డ్రమ్ములలో నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.