VIDEO: జిల్లాలో తప్పిన మరో పెను ప్రమాదం

VIDEO: జిల్లాలో తప్పిన మరో పెను ప్రమాదం

KKD: జిల్లాలో మరో పెను ప్రమాదం తప్పింది. తుని పట్టణంలోని పార్క్ సెంటర్‌లో లారీపై తీసుకెళ్తున్న కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ జారి పడింది. అయితే, రియాక్టర్‌లో ఎటువంటి రసాయనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనా సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై రియాక్టర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.