కార్మికుల సరఫరాలో మాయాజాలం

కార్మికుల సరఫరాలో మాయాజాలం

VSP: మహా విశాఖ నగర పాలక సంస్థ వాహనాలకు కార్మికుల సరఫరాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. గుత్తసంస్థ కార్మికులను సరిగా విధులకు పంపించకుండా నిధులు కాజేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కట్టడి చేయాల్సిన క్షేత్రస్థాయి అధికారులు డబ్బులు తీసుకుని సహకరిస్తుండటంతో గుత్తేదారు అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ నోటీసులు జారీ చేయడానికి సన్నహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.