జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని వినతి
SRD: నాగల్గిద్ద మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పై చదువుల కోసం మారుమూల గ్రామాల వారు కిలోమీటర్ల దూరంలోని ఖేడు వెళ్లాల్సి వస్తోందని పేద విద్యార్థులు వాపోతున్నారు. అలాగే మండలంలో అంబేడ్కర్ భవనం, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు.