సమయపాలన పాటించని సిబ్బందికి మెమోలు జారీ

సమయపాలన పాటించని సిబ్బందికి మెమోలు జారీ

NLR: బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించకపోవడంతో ఎంపీడీవో నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుగురు సచివాలయ సిబ్బందికి మెమోలు జారీ చేసి వివరణ కోరారు. ఆన్‌లైన్ హాజరు పట్టిక ఆధారంగా మెమోలు జారీ చేశామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.