తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. నిందితుడి అరెస్ట్

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. నిందితుడి అరెస్ట్

VSP: వేపగుంట, నాయుడు తోట ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆది ప్రసాద్‌ను పెందుర్తి క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 160 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో, డీసీపీ లతా మాధురి పర్యవేక్షణలో కేసును ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.