క్యాథరాజుపేటలో అపార్ట్మెంట్స్ వాసులు ఆందోళన
NTR: గత నెల రోజుల నుంచి డ్రైనేజీ పొంగిపొర్లుతున్న VMC అధికారులు పట్టించుకోవడంలేదని విజయవాడ క్యాథరాజుపేట జేపీ అపార్ట్మెంట్స్ వాసులు ఆదివారం ఆందోళనకు దిగారు. డ్రైనేజీ వాటర్ వల్ల దోమలతో బెంబేలెత్తిపోతున్నామని భయాందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.