రూ.10ల కాయిన్స్‌తో నామినేషన్ వేసిన అభ్యర్థి

కరీంనగర్: పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు పేరాల మానస రెడ్డి డిపాజిట్ రూపంలో పది రూపాయల కాయిన్స్‌తో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇంటి నుంచి గంపలో తీసుకొచ్చిన రూ. 25 వేల నాణేలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసింది. తన అఫిడవిట్ సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.