డంపింగ్ యార్డ్ విషపూరిత పొగ వల్ల ప్రాణహాని
MNCL: బెల్లంపల్లి గురజాల రహదారిలోని డంపింగ్ యార్డ్ తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెత్తను తగులబెట్టడంతో వచ్చే విషపూరిత పొగ వల్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమీపంలో హాస్టల్స్, కార్యాలయాలు ఉండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాలకు దూరంగా యార్డ్‌ను ఏర్పాటు చేసి ప్రాణహాని తప్పించాలని కోరుతున్నారు.