కాపవరం సొసైటీలో యూరియా నిల్వలు
E.G: కొవ్వూరు మండలం కాపవరం సొసైటీ పరిధిలోని రైతులకు అవసరమైన యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని సొసైటీ ఛైర్మన్ సుంకర సత్తిబాబు తెలిపారు. రైతుల వ్యవసాయ అవసరాలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఎరువులను నిల్వ ఉంచామని ఆయన వెల్లడించారు. రైతులకు అనేక రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఛైర్మన్ ఈ సందర్భంగా తెలిపారు.