క్యూర్ పరిధిలో రూ.1011 కోట్లతో పాఠశాలల అభివృద్ధి
HYD: క్యూర్(ORR ) పరిధి విద్యా అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1011 కోట్లతో పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు తరగతులు ఉండేలా 11 సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. 17 పాఠశాలలను ఉన్నతీకరించడంతో పాటు,164 పాఠశాలల్లో 501 అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయించింది.