రోడ్డుపై కూలిన భారీ వృక్షం.. తప్పిన ప్రమాదం

GNTR: తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హైస్కూల్ ఎదురుగా ఉన్న భారీ వృక్షం ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా నేలకూలింది. భారీ వృక్షం విరిగి రోడ్డుకు ఇరువైపులా పడడంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉండటంతో పాటు హైస్కూల్ విద్యార్థులు ఈ దారి గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రమాదం ఏమి జరగలేదు.