VIDEO: మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

VIDEO: మంత్రుల పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ములుగు జిల్లాలో శుక్రవారం మంత్రుల పర్యటన సందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు. భూభారతి పోర్టల్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన వెంకటాపూర్ మండలంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క, కొండా సురేఖ హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.