'ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు న్యాయం'
ELR: ముసునూరు మండలం కొర్లగుంట గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి మంత్రి కొలుసు పార్థసారథి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజా దర్బార్ (పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్కరి సమస్యపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.