మంత్రి సత్యకుమార్ లేఖకు గుడివాడ కౌంటర్

మంత్రి సత్యకుమార్ లేఖకు గుడివాడ కౌంటర్

AP: మంత్రి సత్యకుమార్ లేఖకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. సత్యకుమార్ సత్యం చెప్పిన సందర్భాలు లేవని ఎద్దేవా చేశారు. 17 వైద్య కళాశాలల్లో 7 కళాశాలల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. సత్యకుమార్ వస్తే వైద్యకళాశాలలు చూపిస్తామన్నారు. మిగతా కాలేజీలను కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఆలోచించాలని పేర్కొన్నారు.