'వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'
NTR: కంచికచర్లలోని కీసర టోల్ ప్లాజా వద్ద ఎస్సై నాని నరేందర్ సోమవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.