VIDEO: కంభంలో మండుతున్న ఎండలు

VIDEO: కంభంలో మండుతున్న ఎండలు

ప్రకాశం: కంభం పట్టణంలో సోమవారం మండుతున్న ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు వృద్ధులు, చిన్నారులు సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు.