పిచ్చి కుక్క దాడి.. తీవ్ర గాయాలు

పిచ్చి కుక్క దాడి.. తీవ్ర గాయాలు

GNTR: పెదనందిపాడు మండలం పరిటాలవారిపాలెంలో శనివారం పిచ్చికుక్క దాడిలో శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి బయట అరుగుపై కూర్చున్న ఆయనపై అకస్మాత్తుగా కుక్క దాడి చేసింది. వెంటనే స్పందించిన స్థానికులు కుక్కను తరిమికొట్టి బాధితుడిని రక్షించారు. ప్రథమ చికిత్స నిమిత్తం పెదనందిపాడు పీహెచ్‌సీకి తరలించారు.