విద్యార్థులకు బూట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులకు బూట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి కన్నెతండాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం బూట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ దాతలు చూపించిన దాతృత్వాన్ని ప్రశంసించారు. ఈ సహాయం చిన్నదిగా కనిపించినా, ఇది పిల్లలలో చదువుపై ఆసక్తిని పెంచుతుందని అన్నారు.