ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

ASR: డుంబ్రిగూడ మండలంలోని పీ.ధర్మ, రాజ్‌కుమార్‌కు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు లభించడంతో బుధవారం యూటీఎఫ్ నేతల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలుగు తెలియని విద్యార్థులకు క్రియాత్మక బోధన, వెనుకబడిన వారికి ప్రత్యేక శ్రద్ధ, యూట్యూబ్‌ వీడియోల ద్వారా పాఠాలు అందించడం వల్లే ఈ గౌరవం దక్కిందని అన్నారు.