సైబర్ క్రైమ్, శక్తి యాప్‌పై అవగాహన
KDP: వేంపల్లె ఉషాకిరణ్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, బాల్య వివాహాలు, మహిళా, గుడ్ టచ్, బాడ్ టచ్, శక్తి యాప్ వినియోగంపై ఇవాళ సీఐ నరసింహులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు అంశాలపై అవగాహన కల్పించి, ప్రభుత్వం రూపొందించిన పలు టోల్ ఫ్రీ నెంబర్‌ల ప్రాముఖ్యత గురించి వివరించారు.