నెతన్యాహూ పారిపోయినట్లు వార్తలు.. ఖండించిన ఇజ్రాయెల్
నెతన్యాహూ దేశం విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది. నెతన్యాహూ దేశంలోనే ఉన్నారని యుద్ధ వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. అత్యాధునిక భూగర్భ బంకర్ నుంచి నిరంతరం సైనిక ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నట్లు చెప్పింది. యుద్ధ సమయంలో దేశాధినేతల భద్రత దృష్ట్యా వారి కదలికలను రహస్యంగా ఉంచటం అంతర్జాతీయ ప్రోటోకాల్‌లో భాగమని పేర్కొంది.