23న సర్టిఫికెట్ వెరిఫికేషన్

NLR: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 23న సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. గత డిసెంబర్, జనవరి నెలలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. అందులో అర్హత పొందిన వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 23వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.