రేపు భారత్-అమెరికా మధ్య చర్చలు

రేపు భారత్-అమెరికా మధ్య చర్చలు

రేపు భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో ఇవాళ రాత్రి అమెరికా ప్రతినిధి భారత్ చేరుకోనున్నారు. కాగా, గత కొంత కాలంగా భారత్- అమెరికా మధ్య టారిఫ్‌ల విషయంలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌పై 50 శాతం టారిఫ్ కొనసాగుతోంది.