రైతన్న మీకోసం కార్యక్రమం
ELR: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వ్యవసాయంలో అవలంబించే నీటి భద్రత, సాంకేతిక వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు ధర, వ్యవసాయ ఇన్సూరెన్స్, వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామ రైతు సంఘంకి ప్రభుత్వం అందజేసిన డ్రోన్ వాడకంను వివరించారు.