జాతీయస్థాయిలో మెరిసిన గురుకుల విద్యార్థులు
KDP: కమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినిలు నేషనల్ సిటిజన్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహించిన డ్రాయింగ్, ఎస్సే, హ్యాండ్ రైటింగ్ పోటీలలో జాతీయస్థాయి అవార్డులు సాధించారు. కురుగాండ్ల కావ్య కళారత్న, వెంకట చిన్నారి, హారిక విద్యాభూషణ, సృజన కళాసిరి, అస్మిత కళారత్న అవార్డులు పొందారు. ఈ సందర్భంగా విజేతలను ప్రిన్సిపాల్ తులసమ్మ అభినందించారు.