నేడు దర్శిలో మెగా జాబ్ మేళా

నేడు దర్శిలో మెగా జాబ్ మేళా

ప్రకాశం: దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కవిత తెలిపారు. ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని, 10వ తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, 18 నుంచి 30ఏళ్ల లోపు వయసు కలవారు పాల్గొనాలని కోరారు.