మూడో విడత పోలింగ్‌కు సిబ్బంది కేటాయింపు
NZB: తుదివిడత ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవోలకు ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలను కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల పరిశీలకుడు శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో ర్యాండమైజేషన్ నిర్వహించారు. గ్రామపంచాయతీలకు సంబంధించి ఒక్కో మండలం వారీగా PO, APO లను పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.