కొత్తపేటలో బీజేపీ అభ్యర్థి విజయం

కొత్తపేటలో బీజేపీ అభ్యర్థి విజయం

MBNR: హన్వాడ మండలంలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తపేట సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పుండుకూర చిన్నప్ప గెలుపొందారు. తన విజయానికి సహకరించిన పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు, ఎంపీ డీకే అరుణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా చిన్నప్ప హామీ ఇచ్చారు.