శ్రీశయన కులస్తుల సంక్షేమానికి కృషి
VSP: శ్రీశయన కులస్తుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని శ్రీశయన కుల సంక్షేమ సేవా సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు తోట వాసుదేవరావు అన్నారు. సోమవారం సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించిన వనసమారాధన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం శ్రీశయన కులస్తులను గుర్తించి పథకాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.