VIDEO: మేడారం జాతరను ప్రపంచానికి చాటి చెప్పాలి: డిప్యూటీ సీఎం
MULG: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను కేవలం ఒక జాతరగా కాకుండా తెలంగాణ గుండె చప్పుడుగా ప్రపంచానికి చాటి చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. కోట్లాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జాతర ఏర్పాట్లకు రూ. 150కోట్లు, శాశ్వత పనులకు రూ. 101కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.