VIDEO: జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

VIDEO: జిల్లా వ్యాప్తంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేటితో ముగిశాయి. పెనమలూరు, కానూరు, గన్నవరం, కంకిపాడు ప్రాంతాల్లో చివరి పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్సాహంతో పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. పరీక్షల ఒత్తిడికి వీడ్కోలు పలుకుతూ పేపర్లు చించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయవంతంగా పరీక్షలు పూర్తి కావడంతో వారి ముఖాల్లో చిరునవ్వులు కురిశాయి.