రాఘవాపురం సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం
KMM: చింతకాని మండలంలోని రాఘవాపురం జీపీ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, గ్రామంలో కాంపెలి కోటమ్మ ఒక్కరే ఉండడంతో ఆమె నామినేషన్ దాఖలు చేయగా ఎన్నిక ఏకగ్రీవమైనట్లే. ఆమె సీపీఐలో కొనసాగుతున్నారు. అలాగే, గ్రామంలోని 4వ వార్డు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా నామినేషన్ దాఖలు చేసిన కోటమ్మ కుమారుడు రమేష్ అలియాస్ దావీదు వార్డు సభ్యుడిగా ఎన్నిక కానున్నాడు.