VIDEO: దళిత భూముల కబ్జాపై కలెక్టరేట్ ఎదుట ధర్నా
అన్నమయ్య: నిమ్మనపల్లె మండలంలో దళితుల భూములను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బహుజన సేన ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శ్రీ చందు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, నిమ్మనపల్లె తహాసీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి దళితుల భూములను ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు. అధికారుల అండదండలతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయన్నారు.