జ్యువెలరీ షాప్‌ను ప్రారంభించిన ఎంపీ

NDL: నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్‌లో కుందన సిల్వర్ జూబ్లీ జ్యువెలరీ షాప్‌ను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కలిసి బుధవారం నాడు ఘనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాలలో ముందుకు వెళ్లాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. వ్యాపారస్తులకు కూడా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె తెలిపారు.