నిర్మల్ నుంచి మహారాష్ట్రకు బస్సు సర్వీసులు ప్రారంభం

NRML: నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి మహారాష్ట్రలోని అప్పారావుపేట, మలక్ జాం గ్రామాలకు కొత్త బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులు రోజుకు మూడుసార్లు అందుబాటులో ఉంటాయని నిర్మల్ డిపో మేనేజర్ పండరి తెలిపారు. ఉదయం 9:50 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5:10 గంటలకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.