సరుబుజ్జిలిలో విస్తృత తనిఖీలు

SKLM: సరుబుజ్జిలి మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో ఎస్సై హైమవతి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ని సోమవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గంజాయి మద్యం అక్రమ నిల్వలు కనుగొనేందుకు ఎస్సై తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గ్రామాల్లోని అనుమానిత వ్యక్తులు, పాత నేరస్తుల ఇళ్లల్లో, ముఖ్యమైన కూడళ్లు, షాపులలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.