గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌కు చేరుతున్న వరద నీరు

NRML: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పాటు ఇక్కడ కురుస్తున్న వర్షాలతో భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 4051 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 356.90 మీటర్ల వద్ద ఉంది.ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.83 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 0.918 టీఎంసీలుగా ఉంది.