దరఖాస్తు గడువు పొడిగింపు
WGL: షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చే మినీ డెయిరీ పథకం (రెండు పాడిగేదెలు) నకు దరఖాస్తుల గడువు ఈనెల 16 వరకు పొడిగించినట్లు జిల్లా కార్య నిర్వాహక సంచాలకులు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఓబీఎంఎంఎస్ పోర్టల్‌లో 16 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.