దేవాలయాలను పరిరక్షించాలి: ఎమ్మెల్యే

SKLM: హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటైన పాలకమండలి సభ్యులతో, దుర్గామాత ఆలయంలో పాలకమండ సభ్యులతో మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.