గొల్లపూడిలో రోడ్డు ప్రమాదం

గొల్లపూడిలో రోడ్డు ప్రమాదం

NTR: విజయవాడలోని గొల్లపూడి 1 సెంటర్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ కారును లారీ ఢీకొంది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే లారీని ఆపి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.