బహిరంగ ధూమపానం చేస్తున్న విద్యార్థులకు సీఐ కౌన్సిలింగ్
MBNR: జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ మున్సిపల్ కాంప్లెక్స్ సమీపంలో బహిరంగంగా ధూమపానం చేస్తున్న బాయ్స్ జూనియర్ కళాశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మహబూబ్నగర్ టూ టౌన్ సిఐ ఐజాజుద్దీన్ శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యసనాలకు విద్యార్థులు బానిసలు కావద్దని, చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని సూచించారు.